ప్రాథమిక పాఠశాలలో కొనసాగుతున్న అంగన్వాడి కేంద్రం
సొంత భవనం మంజూరు చేయాలని మందగూడ గ్రామస్తుల డిమాండ్ మన భారత్, తలమడుగు: ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని కపర్ దేవి, మందగూడ గ్రామాల్లో అంగన్వాడి కేంద్రాలకు సొంత భవనాలు లేకపోవడంతో చిన్నారులు, అంగన్వాడి సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అంగన్వాడి కేంద్రం ప్రాథమిక పాఠశాల భవనంలోనే కొనసాగుతుండటంతో విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు పూర్తిస్థాయిలో అందడం లేదని వారు పేర్కొన్నారు. గ్రామాల్లోని చిన్నారులకు ప్రాథమిక విద్యతో పాటు పౌష్టికాహారం, ఆరోగ్య...