ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని బాధితురాలి వేడుకోలు
మట్టి గుడిసెలో జీవనం సాగిస్తున్నామని ఆవేదన.. అర్హులకు ఇళ్లు కేటాయించాలని డిమాండ్
మన భారత్, తలమడుగు:
తలమడుగు మండలంలోని ఝరి గ్రామానికి చెందిన ఓ మహిళ తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని అధికారులను, ప్రజాప్రతినిధులను కోరుతూ ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా బాధితురాలు మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా మట్టి గుడిసెలోనే జీవనం సాగిస్తున్నానని తెలిపారు. వర్షాకాలంలో ఇల్లు పూర్తిగా దెబ్బతిని తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇందిరమ్మ ఇల్లు కోసం గ్రామ సర్పంచ్‌తో పాటు స్థానిక కార్యదర్శికి పలుమార్లు వినతులు అందించినా స్పందన లేదని ఆరోపించారు. తనకు ఇల్లు మంజూరైనప్పటికీ ఇప్పటివరకు కేటాయించకుండా ఏదో ఒక కారణం చెబుతూ ఆలస్యం చేస్తున్నారని కార్యదర్శి, సర్పంచ్ పై ఆరోపణలు చేశారు.
అర్హులైన పేద కుటుంబాలకు ప్రభుత్వ పథకాల ద్వారా ఇళ్లు అందించాలని, అనర్హులను ఎంపిక చేసి ఇళ్లు కేటాయిస్తున్నారనే ఆరోపణలపై అధికారులు విచారణ జరపాలని ఆమె కోరారు.
తనలాంటి నిరుపేద కుటుంబాలను గుర్తించి వెంటనే ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి ఆదుకోవాలని బాధితురాలు జిల్లా అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులను వేడుకున్నారు.
గొంటి ముక్కుల ప్రసాద్ రిపోర్టర్ మన భారత్.
మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..
