ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారురాలకు అన్యాయం..
తాంసిలో ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులపై బీఎస్పీ ఆరోపణలు.. అర్హులకు న్యాయం చేయాలని సృజన్ పాటిల్ డిమాండ్ మన భారత్, తాంసి: ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలంలో ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుల ప్రక్రియపై బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) బోథ్ నియోజకవర్గ అధ్యక్షుడు సృజన్ పాటిల్ పలు ఆరోపణలు చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అసలు లక్ష్యం నిరుపేదలకు సొంత ఇంటి కలను నెరవేర్చడమేనని, అయితే క్షేత్రస్థాయిలో అర్హులైన కుటుంబాలకు అన్యాయం జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల...