manabharath.com
Newspaper Banner
Date of Publish : 17 June 2026, 3:52 am Editor : manabharath

ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులకు శ్రీకారం..

క్రాంతినగర్‌లో ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులకు శ్రీకారం

 కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో బుధవారం ప్రారంభం

కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నాయకుల పిలుపు

మన భారత్, ఆదిలాబాద్:

ఆదిలాబాద్ పట్టణంలోని 21వ వార్డు క్రాంతినగర్‌లో ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులను బుధవారం ఉదయం 11:45 గంటలకు ఘనంగా ప్రారంభించనున్నట్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓసావార్ వెంకటి తెలిపారు. పేద ప్రజలకు గృహ వసతి కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా లబ్ధిదారులకు శాశ్వత నివాస గృహాలు అందనున్నాయని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ జిల్లా ఇన్‌చార్జి కంది శ్రీనివాస్ రెడ్డి, డీసీసీ అధ్యక్షులు నరేష్ జాధవ్, మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష సతీష్, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, గండ్రత్ సుజాత, అల్లూరి సంజీవ్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు.

ఈ సందర్భంగా ఓసావార్ వెంకటి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. గృహం లేని నిరుపేద కుటుంబాలకు సొంత ఇంటి కలను నిజం చేసేందుకు ఇందిరమ్మ ఇళ్ల పథకం ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందేలా కృషి చేస్తున్నామని తెలిపారు.

క్రాంతినగర్ ప్రాంత ప్రజలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజల సహకారంతో అభివృద్ధి కార్యక్రమాలు మరింత వేగవంతం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమం ద్వారా లబ్ధిదారుల జీవితాల్లో కొత్త ఆశలు చిగురిస్తాయని, పేదల గృహ సమస్య పరిష్కారానికి ఇది ఒక కీలక అడుగుగా నిలుస్తుందని నాయకులు పేర్కొన్నారు.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.