రిమ్స్‌లో కార్మికుల ఆందోళన..
పెండింగ్ వేతనాలు, పీఎఫ్ బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్) ఆసుపత్రిలో పనిచేస్తున్న కార్మికులు తమకు రావాల్సిన పెండింగ్ వేతనాలు, ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. సమస్యల పరిష్కారం కోసం పలుమార్లు అధికారులను సంప్రదించినప్పటికీ స్పందన లేకపోవడంతో కార్మికులు విధులను బహిష్కరించి ధర్నాకు దిగారు. మంగళవారం రిమ్స్ ఆవరణలో పెద్ద సంఖ్యలో...