manabharath.com
Newspaper Banner
Date of Publish : 14 June 2026, 3:21 pm Editor : manabharath

విజయ్-రష్మిక క్యూట్ మూమెంట్స్ వైరల్..

అభిమానులను ఆకట్టుకుంటున్న దృశ్యాలు 

మన భారత్, సినిమా డెస్క్: 

సినీ ఇండస్ట్రీలో ఎప్పుడూ హాట్ టాపిక్‌గా నిలిచే జంటల్లో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఒకరు. వీరిద్దరూ కలిసి కనిపించిన ప్రతిసారీ అభిమానుల్లో ప్రత్యేక ఆసక్తి నెలకొంటుంది. తాజాగా విద్యార్థులకు మెరిట్ స్కాలర్‌షిప్‌లను అందించే కార్యక్రమంలో పాల్గొన్న ఈ స్టార్ జంట మరోసారి సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

ఈ కార్యక్రమంలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న విద్యార్థులతో మమేకమై వారికి స్కాలర్‌షిప్‌లు అందజేశారు. అయితే కార్యక్రమం సందర్భంగా కెమెరాలకు చిక్కిన ఓ చిన్న సంఘటన ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. విజయ్ దేవరకొండ మీసాన్ని రష్మిక మందన్న ప్రేమగా సరిచేస్తూ, సరదాగా మెలేసిన వీడియో దృశ్యాలు సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది.

ఈ దృశ్యాన్ని అభిమానులు పెద్ద ఎత్తున రీషేర్ చేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా వీరిద్దరూ కలిసి నటిస్తున్న “రణబాలి” చిత్రంలోని ఓ రొమాంటిక్ పాటను బ్యాక్‌గ్రౌండ్‌లో జోడించి వీడియోలను వైరల్ చేస్తున్నారు. దీంతో ఈ క్లిప్ మరింత ఆకర్షణీయంగా మారింది.

వీరిద్దరి మధ్య ఉన్న అనుబంధంపై చాలా కాలంగా వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ వీడియో అభిమానులను మరింత ఉత్సాహానికి గురిచేసింది. “రష్మిక విజయ్‌ను ఎంత ఆప్యాయంగా చూసుకుంటుందో ఈ వీడియోలో కనిపిస్తోంది”, “ఇద్దరి మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా ఉంది”, “ఇది చూడటానికి చాలా క్యూట్‌గా ఉంది” అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

అయితే విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న తమ వ్యక్తిగత సంబంధంపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయినప్పటికీ వీరిద్దరూ కలిసి కనిపించిన ప్రతిసారీ సోషల్ మీడియాలో చర్చలు మొదలవుతూనే ఉంటాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియో కూడా అభిమానుల దృష్టిని ఆకర్షిస్తూ ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.

మరోవైపు వీరిద్దరూ కలిసి నటిస్తున్న “రణబాలి” చిత్రంపై కూడా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకోగా, ఈ తాజా వీడియోతో సినిమాపై మరింత ఆసక్తి పెరిగిందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..