manabharath.com
Newspaper Banner
Date of Publish : 13 June 2026, 4:52 am Editor : manabharath

బీజేపీ.. “అమ్మ పేరిట ఒక మొక్క”

ప్రధాని నరేంద్ర మోదీ రికార్డు పాలనకు గుర్తుగా ప్రత్యేక పూజలు

‘అమ్మ పేరిట ఒక మొక్క’ కార్యక్రమంలో బీజేపీ నాయకులు 

మార్కండేయ మందిరం ప్రాంగణంలో మొక్కల నాటకం

– దేశాభివృద్ధి కోసం ప్రార్థనలు

 

మన భారత్, నారాయణపేట:

ప్రపంచవ్యాప్తంగా విశ్వనాయకుడిగా గుర్తింపు పొందిన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిరంతరాయంగా దాదాపు 12 సంవత్సరాలకు పైగా ప్రధానమంత్రి బాధ్యతలు నిర్వహిస్తూ దేశ రాజకీయ చరిత్రలో అరుదైన రికార్డును సృష్టించిన సందర్భంగా నారాయణపేట పట్టణంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు, అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన “అమ్మ పేరిట ఒక మొక్క” నినాదాన్ని స్ఫూర్తిగా తీసుకుని ప్రత్యేక పూజలు, మొక్కల నాటే కార్యక్రమాలు చేపట్టారు.

నారాయణపేట పట్టణంలోని మార్కండేయ మందిరం ప్రాంగణంలో రాష్ట్ర బీజేపీ క్రమశిక్షణ సంఘం సభ్యుడు నామాజీ, కేంద్ర ప్రభుత్వ న్యాయవాది రఘువీర్ యాదవ్, బీజేపీ జిల్లా కోశాధికారి బిల్డర్ వెంకట్ రాములు, వార్డు కమిటీ సభ్యులు, మహిళా కార్యకర్తలు పాల్గొని హనుమాన్ మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు తమ కట్టుబాటును చాటిచెప్పారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ ప్రపంచ వేదికపై మరింత గౌరవాన్ని సంపాదించిందని అన్నారు. దేశ అభివృద్ధి, మౌలిక సదుపాయాల విస్తరణ, డిజిటల్ విప్లవం, రైతు సంక్షేమం, మహిళా సాధికారత, యువతకు అవకాశాల కల్పన వంటి రంగాల్లో విశేష పురోగతి సాధించిందని పేర్కొన్నారు. దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న మోదీకి భగవంతుడు ఆయురారోగ్యాలు, శక్తి, జ్ఞానం ప్రసాదించాలని ప్రత్యేకంగా ప్రార్థించినట్లు తెలిపారు.

అలాగే ప్రధానమంత్రి ఇచ్చిన “అమ్మ పేరిట ఒక మొక్క” పిలుపు పర్యావరణ పరిరక్షణకు ఎంతో ఉపయోగకరమని, ప్రతి కుటుంబం కనీసం ఒక మొక్కను నాటి సంరక్షించాలని సూచించారు. పచ్చదనం పెంపొందితేనే భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణం అందించగలమని చెప్పారు.

ఇదే కార్యక్రమంలో భాగంగా గొడుగేరి హనుమాన్ మందిరంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రతంగపాణి రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లాలోని పలువురు రాష్ట్ర, జిల్లా నాయకులు రఘువీర్ యాదవ్, నాగురావ్ నామాజీ, తమ వార్డుల్లోని హనుమాన్ ఆలయాల వద్ద ప్రత్యేక అర్చనలు నిర్వహించి దేశాభివృద్ధి, ప్రజల శ్రేయస్సు కోసం ప్రార్థనలు చేశారు.

ఈ కార్యక్రమాల్లో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని దేశాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ పట్ల తమ మద్దతును తెలియజేశారు.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..