గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దుదాం : ఎస్పీ
మత్తు పదార్థాల నియంత్రణలో ప్రజల భాగస్వామ్యం కీలకం మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాను గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పిలుపునిచ్చారు. యువతను మత్తు పదార్థాల బారిన పడకుండా కాపాడటం సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాల వినియోగం వల్ల యువత భవిష్యత్తు దెబ్బతినే ప్రమాదం ఉందని ఎస్పీ తెలిపారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు, యువతపై ప్రభావం...