మురుగు కాలువ నిర్మాణం చేపట్టాలి.. కాలనీ వాసుల ఆవేదన
కొత్త నాలీల నిర్మాణం చేపట్టాలి.. వర్షాకాలానికి ముందే మురుగు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించాలని విజ్ఞప్తి మన భారత్, తలమడుగు: ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండల కేంద్రంలోని పలు కాలనీల్లో మురుగు నీటి పారుదల సమస్య రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా వర్షాకాలం సమీపిస్తున్న తరుణంలో కొత్త నాలీల నిర్మాణం చేపట్టి మురుగు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కాలనీ వాసులు సంబంధిత అధికారులను కోరుతున్నారు. స్థానికుల కథనం...