రిమ్స్ కార్మికుల పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలి..
ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కార్మికుల ఆవేదన రెండు నెలలుగా జీతాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సిబ్బంది మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న పేషంట్ కేర్ సిబ్బంది, శానిటేషన్ కార్మికులు, సెక్యూరిటీ గార్డులకు రెండు నెలలుగా పెండింగ్‌లో ఉన్న వేతనాలను వెంటనే విడుదల చేయాలని ఏఐటీయూసీ అనుబంధ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ నాయకులు ప్రభుత్వాన్ని, సంబంధిత అధికారులను డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించి వారికి న్యాయం...