విద్యా హక్కు చట్టం ఉల్లంఘిస్తున్న ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి
డీఈవోకు ముస్లిం యువజన సంఘం వినతిపత్రం ఆర్టీఈ నిబంధనల అమలుపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలోని ప్రైవేట్ విద్యాసంస్థలు విద్యా హక్కు చట్టం (ఆర్‌టీఈ-2009) నిబంధనలను ఉల్లంఘిస్తూ తల్లిదండ్రులపై అదనపు ఆర్థిక భారం మోపుతున్నాయని ఆరోపిస్తూ ముస్లిం యువజన సంఘం ప్రతినిధులు జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈవో)కు వినతిపత్రం సమర్పించారు. జిల్లాలోని అన్ని ప్రైవేట్ పాఠశాలలపై సమగ్ర తనిఖీలు నిర్వహించి చట్ట విరుద్ధ చర్యలకు పాల్పడుతున్న యాజమాన్యాలపై కఠిన చర్యలు...