కేజీబీవీలో గెస్ట్ లెక్చరర్ ఉద్యోగాల భర్తీ
మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తుల ఆహ్వానం జూన్ 12 చివరి తేదీ – ఇంగ్లిష్, నర్సింగ్ విభాగాల్లో అవకాశాలు మన భారత్, తాంసి: ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం (కేజీబీవీ)లో గెస్ట్ లెక్చరర్ పోస్టుల భర్తీకి అర్హత కలిగిన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రత్యేక అధికారి ప్రియాంక తెలిపారు. ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించాలనే లక్ష్యంతో ఈ నియామక ప్రక్రియ చేపడుతున్నట్లు ఆమె వెల్లడించారు....