సదరం శిబిరంలో దివ్యాంగుల అవస్థలు..
గంటల తరబడి నిరీక్షణ రిమ్స్ ఆస్పత్రిలో ఆలస్యంగా ప్రారంభమైన ధ్రువీకరణ ప్రక్రియ మౌలిక సదుపాయాల కొరతపై బాధితుల ఆవేదన.. అధికారులు స్పందించాలని డిమాండ్ మన భారత్ తెలంగాణ, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రిలో గురువారం నిర్వహించాల్సిన సదరం, యూడీఐడీ (యూనిక్ డిసేబిలిటీ ఐడెంటిటీ) ధ్రువీకరణ శిబిరం ఆలస్యంగా ప్రారంభం కావడంతో దివ్యాంగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జిల్లా నలుమూలల నుంచి, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వికలాంగులు గంటల తరబడి వేచి ఉండాల్సి...