ఘోరం: ఆన్‌లైన్ గేమ్స్ ఆడొద్దని చెప్పినందుకు తల్లిదండ్రులపై కత్తితో దాడి
తండ్రి, సోదరి మృతి.. తల్లి, బాలుడు ఆస్పత్రిలో చికిత్స మన భారత్, కర్ణాటక : మొబైల్ ఫోన్లలో ఆన్‌లైన్ గేమ్స్‌కు యువత, చిన్నారులు ఎంతగా బానిసలుగా మారుతున్నారో మరో విషాదకర ఘటన వెలుగులోకి వచ్చింది. రాత్రివేళ ఆన్‌లైన్ గేమ్స్ ఆడొద్దని తల్లిదండ్రులు మందలించడంతో ఆగ్రహానికి గురైన 16 ఏళ్ల బాలుడు ఉన్మాదిలా ప్రవర్తించి తన కుటుంబ సభ్యులపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేసిన ఘటన కర్ణాటక రాష్ట్రంలో కలకలం రేపింది. ఈ దారుణ ఘటనలో తండ్రి, సోదరి...