manabharath.com
Newspaper Banner
Date of Publish : 06 June 2026, 2:40 am Editor : Editor Vishal Kumar

ఘనంగా ఫీల్డ్ అసిస్టెంట్ జన్మదిన వేడుకలు

మన భారత్, మొగుళ్లపల్లి:

వేములపల్లి ఫీల్డ్ అసిస్టెంట్ ఇనిగాల తిరుపతిని శాలువాలతో ఘనంగా సత్కరించిన మేట్లు, ఉపాధి హామీ కూలీలు

మొగుళ్లపల్లి, జూన్ 5: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని నర్సింగాపురం గ్రామానికి చెందిన వేములపల్లి ఫీల్డ్ అసిస్టెంట్ ఇనిగాల తిరుపతి జన్మదిన వేడుకలను వేములపల్లి, కాసులపాడు, నర్సింగాపురం గ్రామాలకు చెందిన ఉపాధి హామీ కూలీలు, మేట్లు ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా పని ప్రదేశంలో ఇనిగాల తిరుపతికి శాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు. అనంతరం కేక్ కట్ చేసి, స్వీట్లు, పండ్లు పంపిణీ చేస్తూ ఆనందోత్సాహాల మధ్య జన్మదిన వేడుకలను జరుపుకున్నారు.

ఈ సందర్భంగా మేట్లు, ఉపాధి హామీ కూలీలు మాట్లాడుతూ, ఇనిగాల తిరుపతి నిస్వార్థంగా పనిచేస్తూ ప్రతి ఒక్కరి సమస్యలను తెలుసుకొని సహాయ సహకారాలు అందిస్తున్నారని కొనియాడారు. గ్రామాభివృద్ధి, ఉపాధి హామీ పనుల నిర్వహణలో ఆయన సేవలు ప్రశంసనీయమని పేర్కొన్నారు.

చత్రపతి శివాజీ మహారాజ్ ఆశీస్సులు, శ్రీ వేంకటేశ్వర స్వామి కృపాకటాక్షాలతో ఇనిగాల తిరుపతి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని, కుటుంబ సభ్యులతో కలిసి సుఖసంతోషాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో మేట్లు, ఉపాధి హామీ కూలీలు, గ్రామ పెద్దలు, స్థానిక ప్రజలు పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..