సాగు భూములకు దారి కల్పించాలని తహసీల్దార్‌కు వినతి
మన భారత్, తలమడుగు: 1995లో ప్రభుత్వం కేటాయించిన భూములకు చేరుకునేందుకు తీవ్ర ఇబ్బందులు తలమడుగు: మండల పరిధిలోని కజ్జర్ల శివారులో ప్రభుత్వం ఎస్సీ కుటుంబాలకు కేటాయించిన సాగు భూములకు వెళ్లేందుకు సరైన దారి లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతూ బాధిత రైతులు తలమడుగు తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు. రైతులు తెలిపిన వివరాల ప్రకారం, 1995లో ప్రభుత్వం కజ్జర్ల శివారులోని సాగు భూములను కజ్జర్ల గ్రామానికి చెందిన 12 ఎస్సీ కుటుంబాలకు,...