గ్రామాల్లో పారిశుద్ధ్య చర్యలు ముమ్మరం
వర్షాకాలానికి ముందే గ్రామాల్లో పారిశుద్ధ్య చర్యలు ముమ్మరం ప్రజారోగ్య పరిరక్షణకు అధికారులు సమన్వయంతో పనిచేయాలి: ప్రత్యేక అధికారి శ్రీనివాసరావు మన భారత్, తలమడుగు: వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి సరఫరా, ప్రజారోగ్య పరిరక్షణ చర్యలను మరింత ముమ్మరం చేయాలని తలమడుగు మండల ప్రత్యేక అధికారి శ్రీనివాసరావు అధికారులను ఆదేశించారు. వర్షాల సమయంలో సీజనల్ వ్యాధులు, దోమల ద్వారా వ్యాపించే అంటువ్యాధులు పెరిగే అవకాశం ఉన్నందున ముందస్తు చర్యలతో ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు...