విద్యార్థుల్లో తెలంగాణ చరిత్రపై అవగాహన కల్పించిన అధ్యాపకులు
మన భారత్, ఆదిలాబాద్:
తాంసి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ఆవరణలో జాతీయ పథాకంతో పాటు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ ప్రాధాన్యతను గుర్తు చేస్తూ ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు.
కళాశాల ప్రిన్సిపాల్ ఆర్. ఉదయ భాస్కర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమం, అమరవీరుల త్యాగాలను విద్యార్థులకు వివరించారు. ప్రత్యేక తెలంగాణ కోసం పోరాడిన ఉద్యమకారుల సేవలను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం విద్య, వ్యవసాయం, సంక్షేమం, మౌలిక వసతుల రంగాల్లో సాధించిన ప్రగతిని వివరించారు.
ఈ సందర్భంగా విద్యార్థులు తెలంగాణ సంస్కృతి, చరిత్ర, రాష్ట్ర ఆవిర్భావ విశిష్టతను ప్రతిబింబించే కార్యక్రమాలు నిర్వహించారు. కళాశాల అధ్యాపకులు విద్యార్థులకు తెలంగాణ ఉద్యమ చరిత్ర, రాష్ట్ర అభివృద్ధి గురించి అవగాహన కల్పించారు.
కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ఆర్. ఉదయ భాస్కర్, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొని తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించారు. వేడుకలు ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించబడ్డాయి.
అనంతరం అడ్మిషన్ ప్రక్రియలో భాగంగా విద్యార్థుల కోసం పలు గ్రామాల్లో అధ్యాపకులు ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వ కళాశాలలో ఉన్న సదుపాయాలను వివరించారు. ప్రైవేటులో చదువుకుంటే ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయని గుర్తు చేశారు.
గొంటి ముక్కుల ప్రసాద్, రిపోర్టర్, మన భారత్
📲 మీ చుట్టుపక్కల వార్తలు, సమస్యలు, విశేషాలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్‌పై క్లిక్ చేయండి.
