గ్రామాభివృద్ధే నా లక్ష్యం – సర్పంచ్ మోడేపు వెంకన్న
మన భారత్, ఆదిలాబాద్ జిల్లా:
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కుచులాపూర్ గ్రామ ప్రజలకు గ్రామ సర్పంచ్ మోడేపు వెంకన్న హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం సాధన కోసం ప్రాణత్యాగాలు చేసిన అమరవీరుల త్యాగాలను ఈ సందర్భంగా స్మరించుకుంటూ వారికి ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మోడేపు వెంకన్న మాట్లాడుతూ, కుచూలాపూర్ గ్రామ ప్రజలు తనపై ఉంచిన నమ్మకానికి ఎల్లప్పుడూ కృతజ్ఞుడిగా ఉంటానన్నారు. గ్రామ ప్రజల ఆశీస్సులు, సహకారంతో సర్పంచ్‌గా ఎన్నికైన తాను గ్రామ సమగ్ర అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని తెలిపారు.
గ్రామంలో మౌలిక వసతుల అభివృద్ధి, పారిశుద్ధ్యం, తాగునీటి సౌకర్యాలు, రహదారులు, విద్యుత్, పచ్చదనం పెంపు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి ప్రజల అవసరాలను తీర్చేందుకు కట్టుబడి ఉన్నట్లు పేర్కొన్నారు. గ్రామ ప్రజలందరి సహకారంతో కుచూలాపూర్‌ను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే తన ప్రధాన లక్ష్యమని అన్నారు.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం ప్రతి తెలంగాణ బిడ్డకు గర్వకారణమని పేర్కొంటూ, రాష్ట్ర అభివృద్ధి, గ్రామాభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
“మీరు నాపై నమ్మకంతో గెలిపించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ గ్రామ అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తానని మనస్పూర్తిగా హామీ ఇస్తున్నాను” అని సర్పంచ్ మోడేపు వెంకన్న తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కుచులాపూర్ గ్రామ ప్రజలకు, యువతకు, మహిళలకు, రైతులకు మరియు రాష్ట్ర ప్రజలందరికీ ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు.
– గొంటి ముక్కుల ప్రసాద్, రిపోర్టర్, మన భారత్ .
📲 మీ చుట్టుపక్కల జరిగే వార్తలు, విశేషాలు, సమస్యలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్‌పై క్లిక్ చేయండి.
