ఉచిత కంటి పరీక్ష శిబిరం విజయవంతం
మన భారత్ | తలమడుగు ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో వందలాది మందికి కంటి వైద్య సేవలు ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని అర్లి గ్రామంలో శనివారం ఉచిత కంటి పరీక్ష శిబిరం విజయవంతంగా నిర్వహించారు. మావలలోని ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి వైద్య బృందం ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈ శిబిరానికి గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై సేవలను వినియోగించుకున్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన కంటి వైద్య...