manabharath.com
Newspaper Banner
Date of Publish : 27 May 2026, 11:16 am Editor : manabharath

హైబ్రీడ్ విధానంలో మహానాడుకు శ్రీకారం..

ప్రధాని మోదీ పొదుపు సూచనలతో సీఎం చంద్రబాబు వినూత్న నిర్ణయం

కార్యకర్తలకు గౌరవం ఇచ్చేది తెలుగుదేశం పార్టీయే: మంత్రి కొండపల్లి శ్రీనివాస్

మన భారత్ | విజయనగరం జిల్లా

ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పొదుపు సూచనలను దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హైబ్రీడ్ విధానంలో మహానాడు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గంలో జరుగుతున్న మహానాడు కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడారు.

మహానాడును ఇంటి ఫంక్షన్‌లా నిర్వహించేందుకు ముందుకు వచ్చిన తెలుగు తమ్ముళ్ల చైతన్యం ఆదర్శనీయమని కొనియాడారు. రెండు రోజుల పాటు 12 ప్రాంతాల్లో మహానాడు కార్యక్రమాల ద్వారా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కార్యకర్తలు, నాయకులకు పలు కీలక అంశాలపై దిశానిర్దేశం చేస్తారని తెలిపారు.

పార్టీ కోసం కష్టపడ్డ సాధారణ కార్యకర్త గంటేడ శ్రీదేవిని పోలీస్ బ్యూరో సభ్యురాలిగా నియమించి మహానాడు వేదికపై కూర్చోబెట్టిన ఘనత తెలుగుదేశం పార్టీదేనని పేర్కొన్నారు. కార్యకర్తలకు గౌరవం ఇచ్చే పార్టీ ప్రపంచంలో తెలుగుదేశం పార్టీ మాత్రమేనని, ఇక్కడ కార్యకర్తే అధినేతగా గుర్తింపు పొందుతాడని అన్నారు.

ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజలందరూ జరుపుకునే అతిపెద్ద రాజకీయ పండగ మహానాడని మంత్రి వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ పార్టీ కుటుంబ సభ్యుల కోసం నిరంతరం శ్రమించే త్రిమూర్తులని కొనియాడారు.

విదేశాల్లో చదువుకుని వచ్చిన తనను ఎమ్మెల్యేగా గెలిపించిన గజపతినగరం నియోజకవర్గ ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తనకు కీలకమైన మంత్రి పదవి అప్పగించి ప్రోత్సహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌కు ధన్యవాదాలు తెలిపారు. తన గెలుపు కోసం సహకరించిన ప్రతి ఒక్కరి కష్టసుఖాల్లో భాగస్వామిగా ఉంటానని హామీ ఇచ్చారు.

గత రెండు సంవత్సరాల్లో నియోజకవర్గంలో అనేక సంక్షేమ పథకాలను అమలు చేయడంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేసినట్లు మంత్రి తెలిపారు.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..