కార్మికులందరికీ ఈఎస్ఐ పీఎఫ్ సౌకర్యాలు కల్పించాలి
సమస్యలు పరిష్కరించకపోతే మున్సిపల్ కార్యాలయం ముట్టడిస్తాం: సీఐటీయూ హెచ్చరిక మన భారత్, మల్కాజిగిరి: కీసర సర్కిల్ పరిధిలో పనిచేస్తున్న మున్సిపల్ కార్మికులందరికీ ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యాలు వెంటనే కల్పించాలని సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కీసర సర్కిల్ డిప్యూటీ కమిషనర్ ఎం. వసంతకు సీఐటీయూ నాయకులు వినతిపత్రం సమర్పించారు. ఈ విషయాన్ని సీఐటీయూ కీసర మండల కన్వీనర్ బంగారు నర్సింగరావు వెల్లడించారు. మున్సిపల్ కార్మికులు ఎన్నో సంవత్సరాలుగా ప్రజలకు సేవలందిస్తున్నప్పటికీ, వారికి...