ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి: మంత్రి
మన భారత్ | ఆదిలాబాద్: రాష్ట్రవ్యాప్తంగా వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జిల్లాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లలో జాప్యం లేకుండా రైతులకు సకాలంలో సేవలు అందించాలని, కొనుగోలు కేంద్రాల నిర్వహణలో ఎటువంటి లోపాలు చోటుచేసుకోకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. ఆదివారం రాష్ట్రంలోని అన్ని జిల్లాల జిల్లా...