manabharath.com
Newspaper Banner
Date of Publish : 23 May 2026, 9:49 am Editor : manabharath

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: నడిగోటి రాము

పెరుగుతున్న ఎండల తీవ్రతపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: నడిగోటి రాము

మన భారత్ | మొగుళ్ళపల్లి: మండుతున్న ఎండలు రోజురోజుకు తీవ్రరూపం దాల్చుతున్న నేపథ్యంలో మొగుళ్ళపల్లి మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ మొగుళ్ళపల్లి మండల ప్రధాన కార్యదర్శి నడిగోటి రాము సూచించారు. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు ఆరోగ్య పరిరక్షణపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆయన పేర్కొన్నారు.

ఈ సందర్భంగా శనివారం నడిగోటి రాము మాట్లాడుతూ, ప్రస్తుతం భానుడి భగభగలు రోజురోజుకు పెరుగుతున్నాయని, రానున్న రోజుల్లో ఎండల తీవ్రత మరింత ఎక్కువయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని తెలిపారు. అధిక ఉష్ణోగ్రతల కారణంగా ప్రజలు అనారోగ్య సమస్యలకు గురయ్యే ప్రమాదం ఉందని, ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, అనారోగ్యంతో బాధపడుతున్న వారు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

మండల ప్రజలు ఉదయం 11 గంటల తర్వాత అత్యవసర పరిస్థితులు తప్ప బయటకు వెళ్లకూడదని సూచించిన ఆయన, తప్పనిసరిగా బయటకు వెళ్లాల్సి వస్తే తలకు గుడ్డ లేదా టోపీ ధరించి ఎండ ప్రభావం నుంచి రక్షణ పొందాలని తెలిపారు. అలాగే శరీరంలో నీటి శాతం తగ్గకుండా తరచూ మంచినీరు తాగడం, మజ్జిగ, కొబ్బరి నీరు వంటి ద్రవ పదార్థాలు తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని సూచించారు.

వడదెబ్బ వంటి ప్రమాదాలను చిన్నచూపు చూడకూడదని, ఒక చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద ఆరోగ్య సమస్యలకు దారి తీసే అవకాశం ఉందని నడిగోటి రాము హెచ్చరించారు. ప్రజలు ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని అవసరమైన జాగ్రత్తలు పాటించాలని, ఎండలో ఎక్కువసేపు తిరగకుండా ఉండాలని సూచించారు.

ప్రస్తుతం వేసవి ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం, వైద్య నిపుణులు కూడా ప్రజలకు జాగ్రత్తలు సూచిస్తున్నారని, ప్రజలు తమ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు అప్రమత్తంగా ఉండటం ఎంతో అవసరమని ఆయన తెలిపారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, కూలీ పనులకు వెళ్లే వారు ఎండ ప్రభావం నుంచి రక్షణ పొందేందుకు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..