సర్పంచ్ సమయస్ఫూర్తి తప్పిన ప్రమాదం..
మన భారత్, మొగుళ్లపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని ముల్కలపల్లి గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా పంట పొలాల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగి గ్రామంలో ఆందోళనకు దారితీసింది. పొలాల్లో ఉన్న పంట వ్యర్థాలు మంటలకు ఆజ్యం పోసినట్లుగా మారడంతో అగ్ని వేగంగా వ్యాపించే పరిస్థితి ఏర్పడింది. అయితే గ్రామ సర్పంచ్ నాంపల్లి శ్రీవాణి-రమేష్ దంపతులు సమయస్ఫూర్తితో స్పందించి పెద్ద ప్రమాదాన్ని తప్పించారు. గ్రామస్థులు మంటలు చెలరేగిన విషయాన్ని సర్పంచ్ దంపతులకు తెలియజేయగానే వెంటనే స్పందించిన...