సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధిద్దాం: భాను ప్రకాష్
మన భారత్, నారాయణపేట : పర్యావరణ పరిరక్షణలో విద్యార్థులు కీలక పాత్ర పోషించాలని, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిషేధించి గుడ్డ సంచుల వినియోగాన్ని అలవాటు చేసుకోవాలని జాతీయ హరిత దళం జిల్లా కోఆర్డినేటర్ హెచ్ భాను ప్రకాష్ పిలుపునిచ్చారు. గురువారం (మే 21, 2026) సమ్మర్ క్యాంప్‌లో భాగంగా జాతీయ హరిత దళం నారాయణపేట జిల్లా ఆధ్వర్యంలో పి.ఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చిన్నపొర్లలో పర్యావరణ విద్యపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు....