భారీ దొంగతనం కేసు ఛేదించిన పోలీసులు..
ఇద్దరు ముద్దాయిల అరెస్ట్.. 304.77 గ్రాముల బంగారు ఆభరణాల స్వాధీనం మన భారత్, విజయనగరం జిల్లా: పూసపాటిరేగ పోలీస్ స్టేషన్ పరిధిలో సంచలనం రేపిన భారీ బంగారు ఆభరణాల దొంగతనం కేసును పోలీసులు అత్యంత చాకచక్యంగా ఛేదించారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి సుమారు 304.77 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకోవడం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. భోగాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ జి. రామకృష్ణ నేతృత్వంలో ప్రత్యేక పోలీసు...