మట్టి పరీక్షపై రైతులకు అవగాహన..
మట్టి నమూనా సేకరణతో శాస్త్రీయ వ్యవసాయంపై రైతులకు సూచనలు మన భారత్, తలమడుగు: తలమడుగు మండలంలోని పల్లి కే గ్రామంలో రైతులకు మట్టి పరీక్షల ప్రాముఖ్యతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బీసీఐ, కేశవాపూర్ ఎఫ్‌పీసీఎల్ స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మట్టి పరీక్ష వల్ల రైతులకు కలిగే ప్రయోజనాలు, మట్టి నమూనాలను సేకరించే విధానం గురించి వివరంగా తెలియజేశారు. శాస్త్రీయ వ్యవసాయ పద్ధతుల ద్వారా రైతులు తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించవచ్చని నిర్వాహకులు...